కామారెడ్డి, డిసెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని నవీన్, భానుప్రసాద్ సహకారంతో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు
, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తాన్ని అందించడానికి నిరంతరం కామారెడ్డి రక్తదాతల సమూహం పనిచేస్తుందని ఇప్పటివరకు 9500 యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదని, మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు.