కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

కామారెడ్డి, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీపీ దశరథ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్మి చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఆడబిడ్డకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి కళ్యాణ లక్మి పేరుతో ప్రతి ఆడబిడ్డకు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రవీందర్‌, రైతు బంధు గ్రామ అధ్యక్షుడు కూడలి బాలరాజు, సర్పంచులు అమృత, సునంద, రెడ్డి నాయక్‌ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బొమ్మిడి రాంరెడ్డి, నర్సాగౌడ్‌, ప్రభాకర్‌, ఎంపీటీసీలు చంద్రకళ గంగారెడ్డి, సంతాలి చంద్రు, డైరెక్టర్‌లు స్వామి గౌడ్‌, పడిగెల శ్రీనివాస్‌, ఉపసర్పంచులు శ్రీనివాస్‌ రెడ్డి, నరేందర్‌, బాలయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు కుక్కల రాజయ్య, బాలనర్సు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »