బాల్కొండ, డిసెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన భూమిపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంపై బాల్కొండ మండల కేంద్రంలో సిసి రోడ్లు బిటి రోడ్లు వేసుకోవడం మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు.
గత నలభై యాభై సంవత్సరాలుగా మండల కేంద్రంలో మోరి లేక రోడ్లు లేక చాలా వెనుకబడి పోయిందన్నారు. మొదటి విడతలో 12 నుంచి 13 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని రోడ్లు, మోరీలు, బిటీ రోడ్స్, సీసీ రోడ్డు, మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. బాల్కొండ ప్రజలు ఆశీర్వదించినందుకు తన బాధ్యతగా అన్ని గ్రామాలను భగవంతుడు ఇచ్చిన శక్తిమేరకు అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా ఉన్నది ఇప్పుడే విధంగా ఉంది ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.