నిజామాబాద్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ అనుబంధంగా రాజకీయ వ్యవహారాల విభాగం కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా గున్నం గంగారాం, కో కన్వీనర్లుగా రాటం అరుణ్, మెట్టు పోశెట్టి ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా కర్నాల నారాయణ, సంయుక్త కార్యదర్శులుగా ఘంట సాయిలు, సుంకరి రవి ఎన్నికయ్యారు. ప్రచార కార్యదర్శులుగా సుంకరి నరేశ్, బొంత సాగర్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య సలహాదారులుగా మూడ ప్రశాంత్, ఇంగు పోశెట్టి, రాటం నవీన్ వ్యవహరించనున్నారు.