కామారెడ్డి, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయాన్ని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కామారెడ్డి సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జి రమేష్‌బాబు, న్యాయ మూర్తులు శ్రీనివాస్, వెంకటేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్, దామోదర్ రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.