డిచ్‌పల్లి, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ బాలికల, బాలుర వసతి గృహాలను మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య శివ శంకర్ తనిఖీ చేశారు. ముందుగా ఓల్డ్ బాయ్స్ హాస్టల్ తనిఖీ చేశారు. అక్కడి మెస్‌లు వంట శాల, విద్యార్థుల రూములను సందర్శించారు. ప్రతి రూమ్‌కు కిటికీలు డోర్లు, ఫ్యాన్స్ లైట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
అక్కడి నుండి న్యూ బాయ్స్ హాస్టల్ వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకొని, గర్ల్స్ హాస్టల్ వెళ్ళారు. అక్కడి చుట్టుపక్కల ప్రదేశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకకున్నారు. సరైన సమయానికి డాక్టర్ విద్యార్థులు విద్యార్థినులకు అందుబాటులో ఉండాలని సూచించారు. చీఫ్ వార్డెన్, వార్డెన్‌లకు కేర్ టేకర్‌లు సిబ్బందితో వసతి గృహాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సమయపాలన పాటించాలని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తనిఖీలో తెలంగాణ విశ్వవిద్యాలయం వసతిగృహాల చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి, బాలుర వసతి గృహాల వార్డెన్ సంపత్, బాలికల వసతి గృహాల వార్డెన్ డా. పార్వతి తెయూ ఇంజనీర్ బి. వినోద్ కుమార్, ఎస్టేట్ ఆఫీసర్స్ అశోక్ వర్ధన్ రెడ్డి, యాదగిరి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ రాజు, కేర్ టేకర్లు, సిబ్బంది ఉన్నారు.