గాంధారి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం గాంధారి మండలంలో పర్యటించిన కలెక్టర్ తిమ్మాపూర్ గ్రామంలో రైతులతో ముచ్చటించారు.
యాసంగిలో రైతులు ఆరుతడి పంటలలు వేసుకొని లాభాలు పొందవచ్చని అన్నారు. సూర్యపువ్వు, పెసర, శనగ పంటలు వేయడం ద్వారా అధిక దిగుబడి వచ్చి రైతులు లాభం పొందవచ్చని అన్నారు. ఎఫ్‌సిఐ ఈ యాసంగిలో పండిరచిన వడ్లను కొనడం లేదని కావున రైతులు ఇబ్బంది పడవద్దని ముందుగానే సూచించడం జరుగుతుందని అన్నారు. ఒకవేళ రైతులు వరి పంటవేయాలి అనుకుంటే వారి ఇష్టం అని, తర్వాత ప్రభుత్వం కొనడం లేదని బాధపడవద్దని కలెక్టర్ అన్నారు.
ప్రైవేట్‌గా వడ్లను అమ్ముకునే వారు వరి పంటవేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గ్రామానికి అనుకోని ఉన్న అటవీ ప్రాతంలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు. కూలీలు తవ్విన కందకాలను పరిశీలించి కూలీలతో మాట్లాడరు. ప్రతి కూలీ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సూచించారు. ఇకముందు కూలీ చేసిన డబ్బులు వారివారి బ్యాంకు అకౌంట్‌లలోనే జమచేయబడతాయని అన్నారు. ప్రతిఒక్కరు ఈ శ్రమ బీమా చేసుకోవాలని సూచించారు.
తర్వాత పొతంగల్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన చెట్లను, పరికరాలను తిలకించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ప్రకృతి వనం ఉందని కొనియాడారు. అక్కడ పని చేస్తున్న వాచర్‌లు ఇద్దరిని అభినందించారు. వారికీ శాలువా కప్పి అభినందించారు.
వాక్సినేషన్ తీరు పరిశీలన..
అంతకు ముందు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ వాక్సినేషన్ తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకునే విధంగా డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు కరోనా టెస్ట్‌లు చేయాలనీ వైద్యులకు సూచించారు. గ్రామాలలో కరోనా లక్షణాలు వారిని గుర్తించి తగు మందులు సరఫరా చేయాలనీ అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక ఎంపీడీఓ సతీష్, డా హరీష్, డా దివ్య, వ్యవసాయ అధికారి యాదగిరి, అధికారులు తదితరులు ఉన్నారు.