కామారెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామన్ని సందర్శించారు. గ్రామంలోని ప్రజల స్థితి గతులు, ప్రజల కనీస అవసరాలు గ్రామ సర్పంచ్ తంబు లలిత బాయిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 10ఎకరాలలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంను పరిశీలించారు. కలెక్టర్‌తో కలిసి వచ్చిన మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రకృతి వనం కాపాడడానికి నీటి వసతికి బోర్ మోటార్ కావాలని కోరారు. మంచి సూచనలు చేశారని కలెక్టర్ వెంటనే మంజూరు చేశారు. అక్కడే గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలోఎంపీడీఓ రాజవీర్, తెరాస జిల్లా నాయకులు రమేష్, తెరాస గ్రామ అధ్యక్షులు దత్తు, వార్డు మెంబర్ రామగౌడ్, రమేష్, శ్యామ్, కిషన్ రావు పాల్గొన్నారు.