కామారెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణం పనులను బీజేపీ పట్టణ కౌన్సిలర్‌లతో కలిసి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం నుండి నూతనంగా నిర్మిస్తున్న మురికాలువ నిర్మాణం విషయంలో అధికారులు ఇష్టా రాజ్యాంగా వ్యవరిస్తున్నారని అన్నారు. మురికాలువ నిర్మాణం కోసం డిఎస్‌పి కార్యాలయం ఎదుట ఉన్న గదిని సైతం కూలగొట్టిన అధికారులు నిజాంసాగర్ చౌరస్తా వద్ద పెట్రోల్ బంకు వద్దకు రాగానే కొన్ని వ్యాపార సముదాయాల భవనాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కావాలని ముందుకు జరిపి నిర్మాణ పనులు చేయాలని చూస్తున్నారని అన్నారు.
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడగా పరిశీలిస్థామని చెప్పారన్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన చౌరస్తా అయిన నిజాంసాగర్ చౌరస్తాను పెరిగిన రద్దీకి అనుగుణంగా వెడల్పు చేయాల్సింది పోయి ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించడం సబబు కాదన్నారు. మురికి కాలువ నిర్మాణం ఏ మాత్రం వంకర పోయినా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని అన్నారు.