కామారెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొట్టిశ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల త్యాగనిరతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఆర్యవైశ్యుల త్యాగనిరతినీ ప్రపంచానికి చాటి చెప్పాడన్నారు. మహాత్మా గాంధీ అనుసరించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం తన జీవితాంతం పోరాడిన మహనీయుడు అని, ఆయన చేసిన సేవలను కొనియాడారు.
భారత స్వతంత్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు పాత్ర ఎనలేనీదని, ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 3 సార్లు జైలుకు వెళ్ళడం జరిగిందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయసాధనకు ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు పాటుపడాలని సూచించారు.
కార్యక్రమంలో అయ్యప్ప గుడి శాశ్వత అధ్యక్షుడు చీల ప్రభాకర్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, ఆర్యవైశ్య నూతన పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, కార్యదర్శి మొగిలిపల్లి భూమేశ్ గుప్తా, కోశాధికారి విశ్వనాధుల రాజేందర్ గుప్తా, అయ్యప్ప అన్నప్రసాద కమిటీ ఛైర్మన్ గందె శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి అంజయ్య గుప్తా, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు వలిపిశెట్టి భాస్కర్ గుప్తా, కైలాస్ సంతోష్ శ్రీనివాస్ గుప్తా, మోత్కూరి శ్రీనివాస్ గుప్తా, నీళ్ల రాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.