కామారెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనంను చిట్టడవిలా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ మండలం తిరుమలాపూర్‌లో బుధవారం బృహత్ పల్లె ప్రక ృతి వనంను పరిశీలించారు. వనంలో కానుగ, రావి, మద్ది, చింత, గోరింటాకు, టేకు వంటి మొక్కలను నాటాలని సూచించారు. చౌడు నేలలు ఉన్నందున వ్యవసాయ అధికారులతో భూసార పరీక్షలు చేయిస్తామని చెప్పారు.
అటవీ అధికారులతో చర్చించి ఈ ప్రాంతానికి అనువైన మొక్కలను నాటే విధంగా చూస్తానని చెప్పారు. అంతకుముందు జుక్కల్ దాని తండాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూరగాయలను సాగు చేయడానికి షెడ్లు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
మార్కెట్లో కూరగాయలకు డిమాండ్ ఉన్నందున రైతులు కూరగాయ పంటలను సాగు చేయాలని కోరారు. జొన్న, మినుము, పొద్దుతిరుగుడు, శనగ, వేరుశనగ వంటి పంటలను సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఆర్‌డిఓ రాజాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.