మున్సిపల్‌ కార్మికుల వంటా వార్పు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఐ.ఎఫ్‌.టి.యు, సిఐటియు, ఎఐటియుసి మున్సిపల్‌ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మున్సిపల్‌ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసికొని భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎం.గోవర్ధన్‌, ఎం.సుధాకర్‌, వై.ఓమయ్య మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల వంటావార్పు రేపు సాయంత్రం వరకు నిరవధికంగా కొనసాగుతుందన్నారు. కార్మికులు రాత్రి కూడా ధర్నా చౌక్‌లోనే నిరసన కొనసాగిస్తారన్నారు. మున్సిపల్‌ కార్మికులను దేవుళ్ళుగా చూడాల్సిన అవసరం లేదని, మనుషులుగా గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు.

కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచుతూ జీవో ఇచ్చి ఆరు నెలలు అవుతుందన్నారు. కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మున్సిపల్‌ కార్మికులకు వేతనాల పెంపు అమలు చేయాలని అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా మున్సిపల్‌ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో వంటా వార్పు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం వేతనాల పెంపు అమలు చేయకపోతే, జనవరి నెలలో మున్సిపల్‌ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. వంటావార్పు కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌, సిపిఐ జిల్లా నాయకులు రాజన్న, పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన తదితరులు విచ్చేసి తమ సంఫీుభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులు భూపతి, నర్సింగరావు, రాజేశ్వర్‌, గోవర్ధన్‌, శివకుమార్‌, కిరణ్‌, సాయగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్‌ భూమిక పోషిస్తుంది

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »