నిజామాబాద్, డిసెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్త కలెక్టరేట్లో సదుపాయాలను, సౌకర్యాలను, హరితహారం మొక్కలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఎక్కడ లేని విధంగా కొత్త కలెక్టరేట్లో ఆకర్షణీయంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటించారని ప్రశంసించారు. గార్డెన్లో కొన్ని రకాల అందమైన పూల మొక్కలు పెట్టించాలని సూచించారు. ఫౌంటెన్ను పరిశీలించారు. కలెక్టర్ చాంబర్ చాలా బాగుందన్నారు. మీటింగ్ హాల్ పరిశీలించారు. అంతకుముందు జిల్లాకు విచ్చేసిన ఆమెకు కలెక్టర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో డిఎఫ్వో సునీల్, ఆర్అండ్బి. ఎస్ఇ రాజేశ్వర్ రెడ్డి, డిపిఓ జయసుధ, ఆర్డిఓ రవి సంబంధిత అధికారులు ఉన్నారు.