కామారెడ్డి, డిసెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20లోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార, పౌర సరఫరా సంస్థల అధికారులతో దాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సహకార కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి రైతులకు డబ్బులు సకాలంలో అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.