కామరెడ్డి, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రోజ్-చైల్డ్ లైన్ 1098 అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు.
సున్నా నుండి 18 సంవత్సరాల బాల బాలికల రక్షణ సంరక్షణ ఎలాంటి ఆపదలో ఉన్న పిల్లలు అయిన 1098 కు కాల్ చేసి సహాయపడాలని మండల పరిషత్ ప్రజా ప్రతినిధులకు అధికారులకు, జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇంటి నుండి పారిపోయిన లేదా తప్పిపోయిన పిల్లలను చుసిన, బాల్య వివాహాల గురించి తెలిసిన,బాల్య కార్మికులను చుసిన, వదిలి వేయబడిన పిల్లలను అనాథ పిల్లలను చుసినా, ప్రమాదాల బారినపడి సహాయ సహకారాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను చూసినా, ఇరుగు పొరుగు బడిలో బడి బయట వారి వేధింపులకు, అసభ్య ప్రవర్తన గురించి తెలిసినా లేదా వినినా, నిరాశ్రయులైన పిల్లలను చూసినా, లైంగిక దోపిడీకి గురైన పిల్లలను చూసినా తెలిసినా, పిల్లలకు కుటుంబ సభ్యులనుండి వచ్చే వేధింపులకు, బడి బయటవున్న పిల్లలను బడిలో చేర్చలనుకున్న, అనాథ పిల్లలు తల్లి లేదా తండ్రి కోల్పోయిన పిల్లలు, చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎక్కడైనా కనిపించిన చూసినా 1098 ఉచితంగా ఏ నెట్వర్క్ నుండి అయిన కాల్ చేయవచ్చని సూచించారు.
కార్యక్రమంలో రోజ్ చైల్డ్ లైన్ 1098 జిల్లా ప్రోగ్రాం కౌన్సిలర్ సౌమ్య, టీమ్ మెంబర్ సురేష్, ఎంఆర్వో ప్రవీణ్‌తో పోస్టర్ ఆవిష్కరించారు. మండల స్థాయి అధికారులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.