ఆర్మూర్, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వఛ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా భీమ్‌గల్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ప్రారంభించారు. భీంగల్ క్లిన్ సిటీగా ఉండాలని దానికి అందరూ సహకరించాలని కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సు, తడి చెత్త పొడి చెత్తపై వివరించారు.
ప్లాస్టిక్ వాడకం బంద్ చెయ్యాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ ఏ.ఇ. రఘు, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, మెప్మా ఆర్‌పిలు బద్రి జలజ, పుష్ప, వీరి వెంట స్థానిక న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్, న్యూ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ముత్యం, నాగేష్, నరేష్, బాలు, మున్సిపల్ శానిటేషన్ ఇంచార్జ్ ప్రవీణ్, ప్రభుత్వ పాఠశాల గడ్డపై విద్యార్థినులు, తోపుడు బండి వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు.