బోధన్, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు పిఆర్‌సి ప్రకారం పెరిగిన వేతనాలను ఇవ్వాలని, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు కట్టి ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల నుండి ఆరున్నర లక్షల వరకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం ఇవ్వాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపుమేరకు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అక్కడే వంటా వార్పు చేపట్టారు.
కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జే. శంకర్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనట్లయితే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో హలో ఐఎఫ్‌టీయూ బోధన్ డివిజన్ నాయకులు కె. రవి, మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.