డిచ్‌పల్లి, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టేబుల్ టెన్నిస్ (వుమెన్) సెలెక్షన్స్ నిర్వహించామని వర్సిటి క్రీడా విభాగం ఇంచార్జ్ డా. మహ్మద్ అబుల్ ఖవి తెలిపారు. సెలెక్షన్స్ టి.ఎస్.డబ్ల్యు.ఆర్.డి.సి (ఉమెన్) దాసనగర్, నిజామాబాద్ కళాశాలలో నిర్వహించామని, ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డా. అబ్దుల్ ఖవి, అధితిగా కళాశాల ప్రిన్సిపాల్ తబస్సుమ్ వైస్ ప్రిన్సిపాల్ లావణ్య సెలెక్షన్స్ ప్రారంబించారు.
టెబుల్ టెక్నిస్ క్రీడా చాలా మంచి క్రీడా అని, రెగులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏకాగ్రతతో పాటు కోఆర్డినేషన్ పెరుగుతాయని వర్సిటి ఇంచార్జ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డా. మహ్మద్ అబ్దుల్ ఖవి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సెలెక్షన్స్ కొరకు 4 కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. సెలక్టయిన క్రీడాకారిణులు అమెట్ యూనివర్సిటీ, చెన్నైలో జరుగు సోలో జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెబుల్స్ వుమెన్ టోర్నమెంట్‌లో జనవరి 6 నుంచి 8 తేదీలలో పాల్గొంటారని తెలిపారు.
సెలక్షన్‌లో వివిధ కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్టరర్స్ హైమవతి, స్వప్న, టియు ఇంటర్ కాలేజ్ టేబుల్ టెన్నిస్ (వుమెన్స్) సెలెక్షన్స్ ఆర్గనైజర్ కె. వర్శిని, వర్సిటీ క్రీడా విభాగం సహాయ ఆచార్యులు (సి) డా. బి. ఆర్. నేత, జూనియర్ అసిస్టెంట్ అశోక్, క్రీడాకారినిలు పాల్గొన్నారు.