కామారెడ్డి, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులను ఏ రకం ఉద్యోగాల కోసం చదువుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్, ఉపాధ్యాయ, బ్యాంక్, సివిల్స్ ఉద్యోగాల కోసం చదువుతున్నామని వారు తెలిపారు.
ఏకాగ్రతతో చదివి పోటీ పరీక్షలలో ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.