కామారెడ్డి, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం పెన్షనర్స్ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు.
సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతినిత్యం నడక, ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. వృద్ధులకు పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జిల్లాధ్యక్షుడు విట్టల్ రావు మాట్లాడారు.
ప్రతి మూడు నెలలకోసారి నేత్ర వైద్య శిబిరాలు తమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు సౌమ్య, బీనా కృప, గంగారం, ఆనందరావు, గంగయ్య, లక్ష్మీనారాయణ, అనంతరావు, కృష్ణమూర్తి, రాజయ్య, రాజా గౌడ్, ముంతాజ్ అలీ, శంకరయ్యలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గంగా గౌడ్, విశ్వనాథం పాల్గొన్నారు.