నిజామాబాద్, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణిత పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేస్తున్నట్ల తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడ్వాయి శ్రీనివాస్ తెలిపారు.
జిల్లాలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రామానుజన్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 21న పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ గణిత ఫోరం అధ్వర్యంలో గణిత ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ అన్నారు. ఇందుకోసం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వలిపిశెట్టి శ్రీనివాస్, అశోక్ పరీక్షల కన్వీనర్ మద్దెల సాయిలు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
ప్రధానోపాధ్యాయులు ప్రతి పాఠశాల నుండి విద్యార్థులు ప్రతిభా పరీక్ష రాసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం గణిత ఉపాధ్యాయులంతా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి పూర్తి సహకారంతోనే పరీక్షలు విజయవంతం అవుతాయన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రోత్సాహం అందించి హాజరుకావడానికి సహకరించాలన్నారు.