కామారెడ్డి, డిసెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డులో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రాకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.
ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ వేయించుకోని వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుజాత్ అలీ, హరీష్, శ్వేత, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.