కామారెడ్డి, డిసెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 12:30 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం సిరిసిల్ల రోడ్లో నిర్వహించనున్నట్టు ఆర్యవైశ్య నాయకులు ఆదివారం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.
కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యుల ఐక్యతను చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆర్యవైశ్య పైన ఉందని, కామారెడ్డి పట్టణంలో 25 వేలకు పైగా ఆర్యవైశ్యులు ఉన్నారని వైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి జరగాలి అంటే ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గ సభ్యులను ఆశీర్వదించి తమ ఆతిథ్యం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, అయ్యప్ప నిత్య అన్నప్రసాద సమితి అధ్యక్షుడు గందే శ్రీనివాస్, కస్తూరి నరహరి గుప్తా, వలిపిశెట్టి లక్ష్మీరాజము గుప్తా, పాత సత్యం గుప్తా, మొగిలిపల్లి భూమేష్ గుప్తా, విశ్వనాధుల రాజేందర్ గుప్తా, కొమురెల్లి వేణు గుప్తా, గోలి శ్రీనివాస్ గుప్తా, కూర శ్రీనివాస్ గుప్తా, గౌరిశెట్టి గుణిందర్ గుప్తా, బొడ్ల వేణు గుప్తా, ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.