కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బలహీనమైన పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య, ఐకేపీ సిబ్బంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సహకారం అందించాలని కోరారు. బలహీనంగా ఉన్నా …
Read More »Daily Archives: December 20, 2021
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని కోరారు. గ్రామాల్లోని రోడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. అపరిశుభ్రత పరిసరాలు లేకుండా చూడాలని …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని …
Read More »దరఖాస్తులకు అనుగుణంగా ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఫారం 7, 8, 8ఏ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఎస్‌ఎస్‌ఆర్ (స్పెషల్ …
Read More »పాఠశాల స్థలాన్ని కబ్జాల నుండి కాపాడండి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్ పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, కాలూరు స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జడ్.పి.హెచ్‌ఎస్ కాలూర్ హైస్కూల్‌కు 03.18 ఎకరాల స్థలం ఉందన్నారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ పాఠశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడిరదన్నారు. ఎలాంటి నిధుల కేటాయింపులు, అనుమతులు లేకుండానే, కనీసం …
Read More »వెల్‌నెస్ సెంటర్‌ను పటిష్టపరచండి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టులకు పెన్షనర్లకు ఉద్యోగులకు ఓపీ సేవలు అందించి మందులను ఉచితంగా సరఫరా చేసే వెల్‌నెస్ సెంటర్‌ను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధివర్గం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. శాశ్వత ప్రాతిపదికన …
Read More »ఇంధన పొదుపు వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కో నిజామాబాద్ బుధవారం ప్రగతి భవన్ ఆవరణలో టీఎస్ రెడ్ కో కరపత్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్ వాడకంపై అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, టీఎస్ రెడ్ కో …
Read More »ఉత్తమ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్‌పల్లి ఎంపిహెచ్‌డబ్ల్యూ ఫిమేల్, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎల్ వసంత, ఐదువందల మార్కులకు గాను, 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత ఐదువందల మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు. …
Read More »రెడ్ క్రాస్ నిజామాబాద్ ఛైర్మన్‌గా నరాల సుధాకర్
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ నిజామాబాద్ ఛైర్మన్‌గా తాను ఎన్నిక కావడానికి తోడ్పాటును ఇచ్చిన బుస్స ఆంజనేయులుకు, డా.నీలి రాంచందర్‌కు, తోట రాజశేఖర్‌కి, కరిపె రవిందర్‌కి రామకృష్ణకు రెడ్ క్రాస్ సిబ్బందికి నరాల సుధాకర్ ధన్యవాదములు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌లోని స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ఎన్నికల అధికారి దక్షిణ మండలం తహసిల్దార్ ప్రసాద్ రెడ్ క్రాస్ నగర కార్యవర్గానికి ఎన్నికలు …
Read More »