నిజామాబాద్, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్పల్లి ఎంపిహెచ్డబ్ల్యూ ఫిమేల్, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎల్ వసంత, ఐదువందల మార్కులకు గాను, 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత ఐదువందల మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు.
విద్యార్థులను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్ర, అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి విజయాలు ఇంకా సాధించాలని విద్యార్థులకు కళాశాల సిబ్బందిని కూడా అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిఈఓ లోలం రఘురాజ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్పల్లి ప్రిన్సిపాల్ చంద్ర విఠల్, తదితరులు పాల్గొన్నారు.