నిజామాబాద్, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కో నిజామాబాద్ బుధవారం ప్రగతి భవన్ ఆవరణలో టీఎస్ రెడ్ కో కరపత్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.
జిల్లా ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్ వాడకంపై అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, టీఎస్ రెడ్ కో జిల్లా మేనేజర్ గంగాధర్, ఇంధన పొదుపుపై టీఎస్ రెడ్ కో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. దీనిలో స్టాప్ అరుణ్ కుమార్, జగదీప్ రామ్, ఉదయ్ పాల్గొన్నారు.