ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ప్రజావాణికి హాజరై మాట్లాడారు.

ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »