నిజామాబాద్, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టులకు పెన్షనర్లకు ఉద్యోగులకు ఓపీ సేవలు అందించి మందులను ఉచితంగా సరఫరా చేసే వెల్‌నెస్ సెంటర్‌ను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధివర్గం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
శాశ్వత ప్రాతిపదికన డాక్టర్లను నియమించాలని, మందుల కొరత లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు ఎస్. హనుమాన్లు, కార్యదర్శి ముత్తారం నరసింహ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి హమీద్ ఉద్దీన్, టిఎన్జీవో అసోసియేట్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి నిజామాబాద్ అధ్యక్షులు సుమన్ తదితరులు ఉన్నారు.