డిచ్‌పల్లి, డిసెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమణాచారి పర్యవేక్షణలో డైనాలాజిక్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ దా నవల్స్ ఆఫ్ గీత హరిహరన్ అనే అంశం పైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న జాన్ సుకుమార్ పరిశోధన పత్రం సమర్పించారు.
మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో జరిగిన పిహెచ్‌డి వైవా సెమినార్‌కు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా తమిళనాడు లోకనాథ్ నారాయణ స్వామి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ఆచార్యులు డా. ప్రభు హాజరయ్యారు.
కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్లశాఖ అధ్యక్షురాలు డా. సమత. ఆర్ట్స్ డీన్ ఆచార్య కనకయ్య, ఆంగ్ల శాఖ విద్యార్థులు పాల్గొన్నారు. వైవా కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందర్ గుప్తా వచ్చి పిహెచ్‌డి విద్యార్థికి ఆశీస్సులు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి రవీందర్‌ను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. నాగరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. అరుణ, తదితరులు పాల్గొన్నారు.