తెలంగాణ ప్రభుత్వం అందరిని సమ దృష్టితో గౌరవిస్తుంది

బాన్సువాడ, డిసెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రైస్తవలకు క్రిస్టమస్‌ పండగ కానుక (దుస్తులు) లను ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి మంగళవారం బాన్సువాడ పట్టణ పిఆర్‌ గార్డెన్‌లో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను సమాన దృష్టితో గౌరవిస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాస పార్టీ ప్రభుత్వం క్రిస్మస్‌ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి ఏడాది పేద క్రైస్తవులకు ఉచితంగా బట్టలతో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌ను అందజేస్తుందని, రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్‌ విందులను ఏర్పాటు చేస్తుందని, క్రిస్టియన్‌ చర్చిలు, గ్రేవ్‌ యార్డుల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తుందన్నారు. బాన్సువాడలో నూతన చర్చి నిర్మాణానికి స్పీకర్‌ పోచారం ప్రత్యేకంగా 26 లక్షల రూపాయల నిధులను అందించారన్నారు.

ఈ సందర్భంగా అందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాదర్‌, బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకట్‌ రాం రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డి, బాన్సువాడ మండల పార్టీ అధ్యక్షుడు మరియు ఆత్మ కమిటీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, బీర్కూర్‌ ఎంపీపీ రఘు, బాన్సువాడ ఏఎంసి చైర్మెన్‌ పాత బాలకృష్ణ,కామారెడ్డి జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు మాజీద్‌, బుడ్మి సొసైటి ఛైర్మెన్‌ పిట్ల శ్రీధర్‌, మండల నాయకులు వెంకట్‌ రాం రెడ్డి, గోపాల్‌ రెడ్డి, ఏజాజ్‌, బాబా, బాన్సువాడ కౌన్సిలర్స్‌, ఫాస్టర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, క్రైస్తవులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »