కామారెడ్డి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి స్థలాలను గుర్తించాలని సూచించారు.
శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని ఐకెపి అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని కోరారు. మండలాల వారీగా మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలపై సమీక్ష చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఐకెపిడిపీఎంలు, అధికారులు పాల్గొన్నారు.