బోధన్, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో బోధన్ ఆర్‌డివోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతకుల లోకేష్ గౌడ్ బివిఎస్ నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ నాయకులు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రమోట్ చేస్తామని ప్రకటించి తర్వాత ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వకుండా పరీక్షలు పెట్టడం వల్ల, సిలబస్ పూర్తి కాకపోవడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఉత్తీర్ణత సాధించలేమని మనస్థాపానికి గురైన విద్యార్థులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ఈ సందర్భంగా చింతకుల లోకేష్ గౌడ్ మాట్లాడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులందరిని ప్రమోట్ చేయాలని, రివాల్యుయేషన్ రుసుము ప్రభుత్వం కట్టి ఉచితంగా చేయాలన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి చేసిన తప్పులను వెంటనే చర్యలు తీసుకొని ఆయనను వెంటనే తొలగించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలు నిరోధించాలని, ఇంటర్ విద్యార్థుల మరణాలపై సంబంధించి విద్య శాఖ మంత్రిని తొలగించాలని, బోధన్‌లో బివిఎస్ నాయకులు, విద్యార్థులు నిజాం షుగర్ ప్యాక్టరీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ జనరల్ సెక్రటరీ ఠాకూర్ అన్వేష్ సింగ్, ఎడపల్లి మండల ఉపాధ్యక్షులు యోగేష్, ఎస్.వి. కాలేజ్ ఇన్‌చార్జి అభినవ్, శివ, సాంబ, సాయి కిరణ్, ఉదయ్, తదితరులు విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.