కామారెడ్డి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఐకేపీ ద్వారా గ్రామాల్లో సర్వే చేపట్టి సోలార్ యూనిట్లు కావలసిన మహిళల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. టీఎస్ రెడ్ కో జిల్లా మేనేజర్ బి. గంగాధర్ ఇంధన పొదుపు ప్రాముఖ్యతను వివరించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.