కామారెడ్డి, డిసెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 29 న కామారెడ్డికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శుక్రవారం బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను ఆయా శాఖ అధిపతులు కార్యాలయాల్లో నోటీసు బోర్డుపై ప్రచురించాలని సూచించారు.
ఈనెల 28న జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో రవీందర్, టిఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.