కామారెడ్డి, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు ఇందిరా గాంధీ చౌక్ వద్ద తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి కాకముందే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 40 శాతం ప్రకటించి మిగతా రిజల్ట్ ని ప్రకటించకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని లేనిపక్షంలో సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఇంటర్మీడియట్ 2021 పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ, కామారెడ్డి యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.