ఎల్లారెడ్డి, డిసెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో మండల వివిధ గ్రామాలకు చెందిన 27 మంది లబ్దిదారులు వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 9 లక్షల 77 వేల 500 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు.
కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి అనుశవ్వ, వారి కుమారుడు నరేష్ పొలంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కి గురై చనిపోయారు. జిల్లా విద్యుత్ శాఖ వారితో ఎమ్మెల్యే మాట్లాడి బాధిత కుటుంబానికి పరిహారంగా 10 లక్షల రూపాయల చెక్కును ఇంటికి వెళ్లి దాసరి.రాజయ్యకి ఎమ్మెల్యే అందజేశారు.
తాడ్వాయి మండల కేంద్రంలోని 3వ వార్డ్‌లో, మండల తహసీల్దార్ కార్యాలయం నుండి చిట్యాల మెయిన్ రోడ్డు వరకు 30 లక్షల రూపాయలతో 1 కిలోమీటర్ సీసీ రోడ్డు పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్, ఎంపీటీసీ ముదం నర్సింలు, మండల ఎంపీపీ కౌడి రవి, జడ్పీటీసీ రమాదేవి నారాయణ, సీడిసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కపిల్ రెడ్డి, మండల తెరాస మాజీ అధ్యక్షుడు సాయి రెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఆత్మా కమిటీ అధ్యక్షుడు సాయిరెడ్డి, శంకర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మంగా రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజా గౌడ్, యూత్ అధ్యక్షుడు రమేష్ రావు, తదితర ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.