డిచ్పల్లి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో దొండి అర్జున్ పరిశోధన చేసిన జానపద సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ సమగ్ర పరిశీలన అనే అంశంపై సోమవారం మౌఖిక పరీక్ష నిర్వహించారు.
హుమానిటీస్ సెమినార్ హాల్లో జరిగిన పరీక్షకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్ గోనానాయక్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. దొండి అర్జున్ ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందర్ గుప్త అభినందించారు. మౌఖిక పరీక్షలో డీన్ ఆచార్య పి.కనకయ్య, డాక్టర్ బాల శ్రీనివాస మూర్తి, డాక్టర్ కె.లావణ్య, డాక్టర్ వి.త్రివేణి, పి.ఆర్.వో. డాక్టర్ అబ్దుల్ ఖవి, పలువురు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.