డిచ్‌పల్లి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల పిజి మొదటి సంవత్సర రెండవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పరీక్షగా కేంద్రాలను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ, కాన్ఫిడెన్సియల్ అధికారి సాయిలు, విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు సహాయ ఆచార్య నాగరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్ తదితరులు పరీక్షించారు.
ఉదయం జరిగిన పరీక్షలో మొత్తం విద్యార్థులు 2 వేల 421 కి గాను 2 వేల 235 విద్యార్థులు హాజరు కాగా 186 మంది విద్యార్థులు గైరాజరైనట్టు పేర్కొన్నారు.
మధ్యాహ్నం జరిగిన పిజి 5వ, 7వ, 8వ మరియు 9వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలో మొత్తం విద్యార్థుల సంఖ్య 228 గాను 221 విద్యార్థులు హాజరు మరియు 7 విద్యార్థులు గైరాజర్ అయినట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ తెలిపారు.