కామారెడ్డి, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సునంద (28) గర్భిణీకి కావలసిన ఓ నెగిటివ్ రక్తం బాన్సువాడ బ్లడ్ బ్యాంకులో లేకపోవడంతో వారి భర్త కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి ఓ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కార్యక్రమంలో రక్తదాతల సమూహ సలహాదారుడు విశ్వనాధుల మహేష్ గుప్తా, వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, అర్చన పాల్గొన్నారు.