పిట్లం, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని స్కాలర్ షిప్‌లు పెంచాలని, గత రెండు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం విద్యార్థుల ఫీజు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండలం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులను కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, తరగతులు జరుగుతున్న సమయంలో బయటకు పంపి ఎండలో నిలబెట్టి అవమాన పరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజులు కట్టలేక విద్యార్థులు కూలీ పనికి వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ నీలకంటి సంతోష్, పట్టణ అధ్యక్షుడు గుర్రపు రమేష్, యూత్ అధ్యక్షుడు కాటే పల్లి హన్మాండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.