నిజామాబాద్, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరస్థునికి జీవిత ఖైదీ పడడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు అభినందించారు.
వివరాల్లోకి వెళితే … గత సంవత్సరం (2020) డిసెంబర్ 15 వ తేదీ అర్దరాత్రి రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన చిలపల్లి చిన్న సాయిలు (35) అనే వ్యక్తి తన తల్లి చిలపల్లి సాయవ్వ (65) తో (పింఛన్, కూలీ ) డబ్బుల గురించి గొడవ పడి, కాలితో గొంతుపై తొక్కి హత్యచేశాడు. ఇట్టి విషయంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చిన్న సాయిలుని జైలుకి పంపారు.
బోధన్ అదనపు జిల్లా కోర్ట్‌లో వాదనలు ముగిసిన అనంతరం 29వ తేదీ బుధవారం న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్ర కళ, చిన్న సాయిలుకి జీవిత ఖైదు, వేయి రూపాయలు జరిమానా విధించారు. ఇట్టి కేసును రుద్రూర్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ రవీందర్ దర్యాప్తు జరిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
కేసు చేధించదములో కృషి చేసిన సిబ్బంది రుద్రూర్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌ని, టి. సాయన్నలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అభినందిస్తూ ప్రశంసించారు.