Daily Archives: December 30, 2021

అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను …

Read More »

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను …

Read More »

పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వఛ్ఛ సర్వేక్షన్‌ 2022 పై గురువారం రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు పట్టణ పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ మాట్లాడారు. సేవ స్థాయి పురోగతి, స్వఛ్ఛ నగరాల ర్యాంకింగ్‌పై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్‌లు, ఈవెంట్లలో …

Read More »

జనవరి 2న డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో జనవరి 2న డిపార్టుమెంట్‌ ఆఫ్‌ విమెన్‌ డెవలప్‌మెంట్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ పరీక్ష కేంద్రం ఉన్నందున డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 8 నుండి తరగతులు యధావిధిగా నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని …

Read More »

సదరం తేదీల ఖరారు..

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 5, 12, 19 అలాగే ఫిబ్రవరి 2, 9, 23, మార్చ్‌ 9, 16, 23 తేదీలలో శిబిరాలు ఉంటాయన్నారు. సదరం ధ్రువీకరణ కావలసినవారు ఈనెల 29 నుండి మీ సేవా …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు 1వ వార్డుకి చెందిన 32 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఒక వైపు కరోన, ఓమిక్రాన్‌ పెరుగుతుంటే నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు రాష్ట్రంలో నిబంధనలు పాటించాలని సూచనలిస్తే రాష్ట్ర …

Read More »

54 మందికి కు.ని. ఆపరేషన్లు

గాంధారి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత స్థానిక ఆసుపత్రిలో కు. ని. శిబిరం నిర్వహించడంతో మంచి స్పందన వచ్చినట్లు డూప్యూటీ డిఎంహెచ్‌ఓ శోభా రాణి తెలిపారు. 54 మందికి ఆపరేషన్‌లు నిర్వహించామన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ప్రతి ఒక్కరికి 880 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. 100 …

Read More »

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రజాకవి, ప్రజాపోరుకు మరోపేరు శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్నకి పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గోరటి వెంకన్న కలం సృష్టించిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి అవార్డు రావడం మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా ఉందన్నారు. సామాన్యుల జీవితాన్నే సాహిత్యంగా మలచి, …

Read More »

బిసి సంక్షేమ సంఘం బాల్కొండ ప్రధాన కార్యదర్శిగా బోదాస్‌ రాజలింగం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గా బోదాస్‌ రాజలింగంకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »