కామారెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు 1వ వార్డుకి చెందిన 32 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఒక వైపు కరోన, ఓమిక్రాన్ పెరుగుతుంటే నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు రాష్ట్రంలో నిబంధనలు పాటించాలని సూచనలిస్తే రాష్ట్ర ప్రభుత్వం వేడుకలకు అర్ధరాత్రి వరకు అనుమతులివ్వడం సిగ్గు చేటు అన్నారు.
దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్నందున ప్రజలు కరోన నిబంధనలకు పాటిస్తూ సామాజిక దూరం పాటించి మూడో వేవ్ ముప్పు రాకుండా చూడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో తెలంగాణాలో ఉచిత మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యిందని ఇందుకు కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు.