ఆర్మూర్, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రజాకవి, ప్రజాపోరుకు మరోపేరు శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్నకి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గోరటి వెంకన్న కలం సృష్టించిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి అవార్డు రావడం మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా ఉందన్నారు. సామాన్యుల జీవితాన్నే సాహిత్యంగా మలచి, పాటలుగా మార్చి ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప వ్యక్తి గోరటి వెంకన్న అన్నారు. వారు రాసిన అనేక పుస్తకాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, గోరంటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మనందరికి ఆదర్శంగా నిలవనుందన్నారు. మన తెలంగాణ సమాజమే గర్వపడే సన్నివేశమన్నారు.