గాంధారి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత స్థానిక ఆసుపత్రిలో కు. ని. శిబిరం నిర్వహించడంతో మంచి స్పందన వచ్చినట్లు డూప్యూటీ డిఎంహెచ్‌ఓ శోభా రాణి తెలిపారు. 54 మందికి ఆపరేషన్‌లు నిర్వహించామన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి 880 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. 100 మందికి ఆపరేషన్ చేయడానికి అనుమతి రాగా మొదటి విడతలో 54 మందికి ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. మిగతా వారికి తర్వాత నిర్వహిస్తామన్నారు. కుటుంబ నియంత్రణ శిబిరాన్ని స్థానిక జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధా బలరాం నాయక్, సర్పంచ్ సంజీవ్ యాదవ్ సందర్శించి వైద్యులను అభినందించారు. శిబిరంలో వైద్యులు డా. జోయెల్, డా హరీష్, డా రమణ, డా. హరికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.