రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చామని డీజీపీ వివరించారు. ఆరోగ్యశాఖ సూచనలను అమలు చేస్తామని చెప్పారు. విమానాశ్రయంలో కూడా పరీక్షలు చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామని వివరించారు. కొవిడ్‌ నిబంధనలను పోలీస్‌శాఖ కఠినంగా అమలు చేస్తుందని డీజీపీ వెల్లడిరచారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »