కామారెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు. నాలుగు 4 చక్రాల మోటార్ సైకిలు, 1 బ్యాటరీ వీల్ చైర్, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.