నిజామాబాద్, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 5, 12, 19 అలాగే ఫిబ్రవరి 2, 9, 23, మార్చ్ 9, 16, 23 తేదీలలో శిబిరాలు ఉంటాయన్నారు.
సదరం ధ్రువీకరణ కావలసినవారు ఈనెల 29 నుండి మీ సేవా కేంద్రాలలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. స్లాట్లో సూచించిన తేదీలలో మాత్రమే శిబిరానికి రావాలన్నారు.