నిజామాబాద్, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజుల క్రితం బర్దిపూర్ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి…
29వ తేదీ బుధవారం రాత్రి సమయంలో బద్ధిపూర్ గ్రామ శివారులో ఈనాడు ఆఫీస్ ప్రక్కన బర్దిపూర్ గ్రామానికి వెళ్లే బి.టి రోడ్డులో నాగారం నిజామాబాద్‌కు చెందిన షేక్ మాజీద్ అనే వ్యక్తిని పులాంగ్, నిజామాబాద్‌కి చెందిన జుబేర్, అతని చిన్నాన్న అయిన షేక్ అతీజ్లు కత్తితో గొంతులో పొట్టలో పొడిచి చంపారు. మృతుడు షేక్ మాజీద్ తల్లి సహెర బేగం ఫిర్యాదు మేరకు డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా కేసును అదనపు డి.సి.పి (లా అండ్ ఆర్డర్) డా. వినిత్. జి పర్యవేక్షణలో నిజామాబాద్ ఎ.సి.పి ఎ. వెంకటేశ్వర్లు, డిచ్పల్లి సి.ఐ.పి ఆర్. రఘునాధ్ దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు షేక్ మాజిద్, నిందితుడు షేక్ జుబేర్ల మధ్య వ్యక్తిగత కలదు. అందులో భాగంగా షేర్ మాజీద్ని చంపాలనే ఉద్దేశ్యముతో షేక్ జుబేర్ తన చిన్నాన్న అయిన షేక్ అతీక్ సహాయంతో షేక్ మాజీద్ని బద్దిపూర్ గ్రామానికి తీసుకొనిపోయి మద్యం తాగించి బర్దిపూర్ గ్రామానికి వెళ్లే బి.టి రోడ్డులో కత్తితో గొంతు, పొట్ట బాగములో పొడిచి చంపి వ్యవసాయ కాలువలో పడేసినారు.
కేసు దర్యాప్తులో సహకరించిన డిచ్పల్లి ఎస్ఐ ఎ. అంజనేయులు, జక్రాన్‌పల్లి ఎస్ఐ ఎమ్.డి. ఆసీఫ్, ఇందల్వాయి ఎస్ఐ గౌరెంధర్, పోలీసు సిబ్బంది జి. లింగమ్, కేర్బాజీ, ఎమ్. రాజేశ్వర్లను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, అభినందిస్తూ ప్రశంసించారు.