Yearly Archives: 2021

ఏకాగ్రతతో చదది ఉద్యోగం సాధించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులను ఏ రకం ఉద్యోగాల కోసం చదువుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్‌, ఉపాధ్యాయ, బ్యాంక్‌, సివిల్స్‌ ఉద్యోగాల కోసం చదువుతున్నామని వారు తెలిపారు. ఏకాగ్రతతో చదివి పోటీ పరీక్షలలో ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను …

Read More »

ప్రతి విద్యార్థికి ప్రతిభ సర్టిఫికెట్‌ అందజేస్తాం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ అందజేస్తున్నట్ల తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాడ్వాయి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్‌ 21న పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ గణిత ఫోరం …

Read More »

ఇంటర్‌ కాలేజ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టీం ఎంపిక

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (వుమెన్‌) సెలెక్షన్స్‌ నిర్వహించామని వర్సిటి క్రీడా విభాగం ఇంచార్జ్‌ డా. మహ్మద్‌ అబుల్‌ ఖవి తెలిపారు. సెలెక్షన్స్‌ టి.ఎస్‌.డబ్ల్యు.ఆర్‌.డి.సి (ఉమెన్‌) దాసనగర్‌, నిజామాబాద్‌ కళాశాలలో నిర్వహించామని, ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డా. అబ్దుల్‌ ఖవి, అధితిగా కళాశాల ప్రిన్సిపాల్‌ తబస్సుమ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ లావణ్య సెలెక్షన్స్‌ ప్రారంబించారు. టెబుల్‌ …

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటీకి ఎన్నికలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కార్యవర్గపు గడువు ముగిసిన పిదప రాష్ట్ర గవర్నర్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు నిజామాబాదు జిల్లా పాలనాధికారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయబడినది. మండల స్థాయి ఎన్నికలు 20 డిసెంబర్‌ రోజున మండల కార్యాలయంలో నిర్వహించబడును, అదేవిదంగా నిజామాబాదు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎన్నికలు జిల్లా రెడ్‌ క్రాస్‌ భవనం నందు నిర్వహించబడునని రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా …

Read More »

భీమ్‌గల్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌

ఆర్మూర్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వఛ్ఛ సర్వేక్షన్‌ 2022లో భాగంగా భీమ్‌గల్‌ మున్సిపల్‌ కేంద్రంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ప్రారంభించారు. భీంగల్‌ క్లిన్‌ సిటీగా ఉండాలని దానికి అందరూ సహకరించాలని కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సు, తడి చెత్త పొడి చెత్తపై వివరించారు. ప్లాస్టిక్‌ వాడకం బంద్‌ చెయ్యాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భీంగల్‌ మున్సిపల్‌ ఏ.ఇ. రఘు, …

Read More »

బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు వంటా వార్పు

బోధన్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు పిఆర్‌సి ప్రకారం పెరిగిన వేతనాలను ఇవ్వాలని, పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌లు కట్టి ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల నుండి ఆరున్నర లక్షల వరకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం ఇవ్వాలని, ఇతర సమస్యల …

Read More »

వ్యాక్సిన్‌ వేయించుకోని వారి వివరాలు సిద్ధం చేయండి…

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 18 లోగా అర్హత గల వారికి మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ చేయించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్‌ వ్యాక్సినేషన్‌, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీ అధికారులు …

Read More »

అర్బన్‌ అటవీ పార్క్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్బన్‌ అటవీ పార్క్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రియాంక వర్గీస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆమె పలు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. మాక్లూర్‌, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ మండలాలలో పర్యటించారు. మాక్లూర్‌ అర్బన్‌ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి …

Read More »

మున్సిపల్‌ కార్మికుల వంటా వార్పు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఐ.ఎఫ్‌.టి.యు, సిఐటియు, ఎఐటియుసి మున్సిపల్‌ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మున్సిపల్‌ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసికొని భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …

Read More »

20 లోగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20లోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార, పౌర సరఫరా సంస్థల అధికారులతో దాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. సహకార కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »